చిరిగిపోయి చీలికలుగా బతుకమ్మ చీరలు

చిరిగిపోయి చీలికలుగా బతుకమ్మ చీరలు

కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారు చేయించిన బతుకమ్మ చీరలు మూల పడ్డాయి. సిరిసిల్ల ఇందిరా నగర్ మార్కెట్ యార్డు గోదాముల్లో వందలకొద్ది బతుకమ్మ చీరలు నిర్లక్ష్యంగా నిల్వ చేశారు. గత ఏడాది పంపిణీ చేయగా మిగిలిన చీరలు నిల్వ చేయగా... అవి కాస్త చిరిగిపోయి చీలికలు, పేలికలుగా మారుతున్నాయి. చీరల్ని సక్రమంగా భద్రపరచకపోవడంతో చెల్లా చెదురుగా పడి చీలికలుగా పాడయ్యాయి.  మిగిలిపోయిన చీరలను వచ్చే ఏడాది పంపిణీ చేసేందుకు వీలుగా వీటిని మూడు చోట్ల భద్రపరిచామని అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉంచిన బతుకమ్మ చీరలకు భద్రంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. 

గత సంవత్సరం దాదాపు రూ. 300 కోట్లు వెచ్చించి 6.80 కోట్ల మీటర్ల క్లాత్ సేకరించగా సుమారు రూ. 50 కోట్ల విలువ చేసే 1.30 కోట్ల మీటర్ల క్లాత్ ఇక్కడి గోదాముల్లో స్టాక్ నిలిచిపోయింది. ఈ చీరెలను సిరిసిల్లలోని గోదాముల్లో నిల్వ ఉంచిన అధికారులు వచ్చే సంవత్సరం పంపిణీ చేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం. దీంతో ఈ ఏడాది బతుకమ్మ చీరలను 1.30 కోట్ల మీటర్లకు పరిమితం చేశారు. అయితే రాష్ట వ్యాప్తంగా ఆర్భాటంగా పంపిణీ చేసే బతుకమ్మ చీరలను కాపాడే విషయంలో ప్రత్యేక దృష్టి సారించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. సిరిసిల్ల ఏఎంసీ ఆవరణలో చిరిగిపోయిన చీరల ముక్కలు పడిపోతున్నా పట్టించుకునేవారే లేకుండా పోయారని పలువురు ఆరోపిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి: 

కేసీఆర్ ఆ మూడు చోట్లే ముఖ్యమంత్రి

విభజించి మోడీ.. మోసాలతో కేసీఆర్ పాలిస్తున్రు