ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

వరంగల్​ సిటీ, కాజీపేట, వెలుగు: రాష్ట్ర ఆడపడుచులు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్​ చీరలను కానుకగా అందిస్తున్నారని చీఫ్​విప్​ దాస్యం వినయ్​భాస్కర్​అన్నారు. శుక్రవారం బల్దియా పరిధిలోని 11,29,  47, 62, 63 డివిజన్లలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వినయ్​భాస్కర్​ మాట్లాడుతూ  సొంత స్థలం ఉంటే ప్రభుత్వం రూ. 3లక్షలు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు. అంతకు ముందు బతుకమ్మ చీరలను భద్రకాళి అమ్మవారి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  మేయర్​గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య, కుడా చైర్మన్​ సుందర్​రాజ్​యాదవ్, కుడా మాజీ చైర్మన్ యాదవ రెడ్డి, కార్పొరేటర్లు దేవరకొండ విజయలక్ష్మి, సంకు నర్సింగ్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ జోనా, లీడర్లు పాల్గొన్నారు. 

దేశం కేసీఆర్ లీడర్ షిప్ కోరుకుంటోంది

నర్సింహులపేట, వెలుగు: దేశ రైతాంగం పక్షాన సీఎం కేసీఆర్ కొట్లాడుతున్నారని, యావత్ దేశం కేసీఆర్ లీడర్ షిప్ కోరుకుంటోందని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగరం జీపీలోని పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రెడ్యానాయక్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. లోకల్ గా ఉండే , ప్రజల కోసం పనిచేసే లీడర్లను నమ్మాలని, ఎలక్షన్ల టైంలో వచ్చేవారిని నమ్మొద్దన్నారు.

కేంద్ర ప్రభుత్వం రైతుల మోటర్లకు మీటర్లు పెడతామని పదేపదే చెబుతున్నారని దీనివల్ల చిన్న రైతుపై పెను భారం పడటమే కాకుండా రైతుల వీపులు చింతపండు కావడం ఖాయమన్నారు. అనంతరం మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్జీ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర రెడ్డి,  ఎంపీపీ సుశీల, రైస్ మిల్లర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డీఎస్ రవిచంద్ర, పార్టీ మండలాధ్యక్షుడు మైదం దేవేందర్, పీఏసీఎస్ చైర్మన్ రాము, సర్పంచ్​ల ఫోరం మండలాధ్యక్షులు శంకర్, సర్పంచులు అజ్మీర లక్ష్మీ, కళావతి, హొలీ పాల్గొన్నారు.

కాంగ్రెస్​ ఇచ్చిందా.. బీజేపోడు ఇచ్చిందా..

మరిపెడ, వెలుగు: బతుకమ్మ చీరలు కాంగ్రెస్​ ఇచ్చిందా. బీజేపీ వచ్చిందా.. అని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రశ్నించారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎంపీపీ ఆఫీస్​లో జరిగిన కార్యక్రమంలో 200 మంది మహిళలకు ఎమ్మెల్యే బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులకు చేయూతనిస్తూ తెలంగాణ ఆడపడుచులకు సీఎం కేసీఆర్ అందిస్తున్న కానుక బతుకమ్మ చీర అని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో లైబ్రరీ సంస్థ చైర్మన్ నవీన్ రావు, ఎంపీపీ అరుణ, జడ్జీటీసీ శారద, మున్సిపల్ చైర్​పర్సన్​ సింధూర, తహసీల్దార్​ రాంప్రసాద్, ఎంపీడీవో ధన్సింగ్ పాల్గొన్నారు.

ప్రైవేట్​ హాస్పిటల్స్​లో తనిఖీలు

వరంగల్​ సిటీ, వెలుగు: హనుమకొండ ప్రైవేట్​ హాస్పిటల్స్​లో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆఫీసర్లు, డాక్టర్లు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్​వో బి.సాంబశివరావు మాట్లాడుతూ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్​చట్టం–2010 అనుసరించి ధరల పట్టిక, పర్మిషన్​పత్రాలను ప్రదర్శించినందు వలన కాకాజీ కాలనీలోని 4 ప్రైవేట్​ హాస్పిటల్స్​లో మూడింటికి, ఒక డెంటల్​ హాస్పిటల్​కు రిజిస్ట్రేషన్​లేనందున నోటీసులు జారీ చేయనున్నట్లు చెప్పారు. తనిఖీల్లో అడిషనల్​ డీఎంహెచ్​వో మదన్​మోహన్, డిప్యూటీ డీఎంహెచ్​వో యాకూబ్​ పాషా, జిల్లా మాస్​ మీడియా ఆఫీసర్​ అశోక్​ రెడ్డి పాల్గొన్నారు. 

ములుగులో మూడు హాస్పిటళ్లు సీజ్

ములుగు,వెలుగు : ములుగులో రిజిస్ట్రేషన్ అనుమతులు లేని మూడు ప్రైవేట్ హాస్పిటళ్లను డీఎంహెచ్​వో అప్పయ్య సీజ్ చేశారు. శుక్రవారం ఐదు ప్రైవేటు హాస్పిటళ్లు, క్లినిక్​లను డిప్యూటీ డీఎంహెచ్​వో క్రాంతి కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్ వెంకటేశ్వరరావు, డెమో తిరుపతయ్య, మానిటరింగ్ ఆఫీసర్ దుర్గారావులతో కూడిన టీం తనిఖీ చేశారు. ములుగులోని గణపతి హెల్త్ కేర్ డెంటల్ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ క్లినిక్, వినయ్ క్లినిక్, పద్మాక్షి క్లినిక్ లను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలించిన అనంతరం మూడు హాస్పిటళ్లను సీజ్ చేసినట్లు డీఎంహెచ్​వో వివరించారు.

మునుగోడు ఎన్నికలో కోసమే ’గిరిజన బంధు’

మహబూబాబాద్​ అర్బన్​, వెలుగు:  దళిత, గిరిజనులను మభ్యపెట్టెందుకే దళిత బంధు, గిరిజన బంధు అంటున్నారని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్​ మెంబర్​ గరికపాటి మోహన్​రావు విమర్శించారు. శుక్రవారం ‘ప్రజాగోస–బీజేపీ భరోసా’ లో భాగంగా మహబూబాబాద్​ మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో బైక్​ర్యాలీ నిర్వహించారు.  ఈ సందర్భంగా మోహన్​రావు మాట్లాడుతూ  హుజూరాబాద్ ఎలక్షన్ లలో దళిత బంధు, మునుగోడు ఎలక్షన్ లలో గిరిజన బంధు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే అని అన్నారు.  రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని బంధులు పెడతాడో? అని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ చాడ సురేశ్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీశైలంగౌడ్​, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్​ హుస్సేన్​నాయక్​, జిల్లా అధ్యక్షుడు రాంచందర్​రావు, సీతయ్య, సిద్ధార్ధ్​ రెడ్డి, మురళీ, సంపత్​ పాల్గొన్నారు.

నేటి నుంచి కాజీపేట దర్గా ఉర్సు 

కాజీపేట, వెలుగు: హనుమకొండ జిల్లా కాజీపేటలోని బియాబాని దర్గా ఉర్సు శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ ఉత్సవాలకు సంబంధించి శుక్రవారం దర్గా పీఠాధిపతి ఖుస్రూ పాషా, చీఫ్​విప్​ దాస్యం వినయ్​భాస్కర్​ మీడియాతో మాట్లాడారు. రాష్ర్టంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ దర్గా ఉర్సు ఉత్సవాలను  మూడు రోజులు పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ  మతసామరస్యానికి ప్రతీక కాజీపేట దర్గా అని అన్నారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వ తరఫున పూర్తి చేశామన్నారు. 

కేజీబీవీ విద్యార్థులకు సత్కారం

పాలకుర్తి, వెలుగు: పాలకుర్తి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో టెన్త్​, ఇంటర్​ రిజల్ట్స్​లో ప్రతిభ కనబరిచిన స్టూడెంట్లకు మహాత్మా హెల్పింగ్​ హ్యాండ్స్​ ఫౌండర్​ గంట రవీందర్​శుక్రవారం సత్కరించారు. 42 మంది మెరిట్ ​స్టూడెంట్లకు పురస్కారాలు అందజేశారు. చీఫ్​ గెస్ట్​గా హాజరైన ఎర్రబెల్లి ఛారిటబుల్​ట్రస్ట్​ చైర్మన్​ ఎర్రబెల్లి ఉషాదయాకర్​రావు మాట్లాడుతూ ప్రభుత్వ స్కూల్​లో చదువుకుంటున్న విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ స్కూళ్లు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, జీసీడీవో గౌసియా బేగం, ఎస్​వో నవీన, సర్పంచ్​ యాకాంతారావు, హెచ్ఎం నర్సయ్య, టీచర్లు పాల్గొన్నారు.

బెస్ట్ ​స్టూడెంట్స్​కు సన్మానం

మహబూబాబాద్, వెలుగు: ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక  సూచించారు. శుక్రవారం మహబూబాబాద్ లోని ఓ ఫంక్షన్​ హాల్​లో మోడల్ స్కూల్స్, కేజీబీవీల్లో బెస్ట్​ ర్యాంకులు సాధించిన స్టూడెంట్స్​కు సన్మానం, ప్రస్తుతం టెన్త్​క్లాస్​ విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టెన్త్​పరీక్షా ఫలితాల్లో కేజీబీవీ, మోడల్ స్కూల్ విద్యార్థులు 10 జీపీఏ ర్యాంకులు సాధించాలన్నారు. 69 మంది స్టూడెంట్స్​ను కలెక్టర్ సన్మానించి, ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. 

పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట

గూడూరు, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని మహబూబాబాద్​ఎమ్మెల్యే శంకర్ నాయక్ తెలిపారు. గూడూరు మండలం బొద్దుగొండ, దామెరవంచ, చక్రుతండా, గూడూరు గ్రామాలలో ఆసరా పింఛన్లు, బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం గూడూరు చందున్ చెరువులో చేప పిల్లలను వదిలారు. సమావేశంలో ఎంపీపీ సుజాత, జడ్పీ కోఆప్షన్ మెంబర్ ఖాసీం, వైస్ ఎంపీపీ వీరన్న, లక్ష్మణ్ రావు పాల్గొన్నారు.