ఈనెల 19న ఛలో ఢిల్లీ కార్యక్రమానికి బీసీ పిలుపు

ఈనెల 19న ఛలో ఢిల్లీ కార్యక్రమానికి బీసీ పిలుపు

బీసీల డిమాండ్ల సాధనకై ఈనెల 19న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు..బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ఛలో ఢిల్లీ వాల్ పోస్టర్‭ను ఆవిష్కరించారు. ఈనెల 19న ఛల్లో ఢిల్లీ కార్యక్రమం, 20న పార్లమెంట్ ముట్టడి, 21న అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించనున్నట్లు రాచాల యుగంధర్ గౌడ్ తెలిపారు. పార్టీలకు అతీతంగా బీసీ సభ్యులు తరలివచ్చి ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

బీసీ జనగణన నిర్వహించేది లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఆఫిడవిట్ దాఖలు చేయడాన్ని.. దేశంలోని బీసీలంతా వ్యతిరేకిస్తున్నారని రాచాల యుగంధర్ అన్నారు. బీసీ కుల గణన చేయకపోవడం వల్ల హక్కులను కోల్పోవడమే కాకుండా రిజర్వేషన్లు కూడా అందడం లేదన్నారు. రాజ్యాంగ సవరణ చేస్తూ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి.. 10% రిజర్వేషన్లు కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లు పెంచడం వల్ల వచ్చే ఇబ్బందులేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ప్రధానిగా ఉండి కూడా కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయకపోవడం, బీసీ గణన చేపట్టకపోవడం, బీసీ రిజర్వేషన్లు పెంచకపోవడం దౌర్భాగ్యమన్నారు.