
సూర్యాపేట, వెలుగు : బీసీల హక్కుల కోసం పోరాడుతున్న తీన్మార్ మల్లన్నపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీసీ జేఏసీ నేతలు తెలిపారు. తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడికి నిరసనగా ఆదివారం సూర్యాపేటలోని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ నాయకులపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో పాతర్ల పహాడ్ మాజీ సర్పంచ్ కేశబోయిన మల్లయ్యయాదవ్, మాజీ కౌన్సిలర్లు అన్నెపర్తి రాజేశ్, కుంభం నాగరాజు, వల్లాల సైదులు యాదవ్, కుంభం వెంకన్న యాదవ్, మీర్ అక్బర్, బొమ్మగాని సైదులు, బొల్లె సైదులు, కరుణాకర్, పగిళ్ల శరత్, జనార్ధన్, చింతకాయల జానయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.