
మిర్యాలగూడ, వెలుగు : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కల్వకుంట్ల కవిత అనుచరులు దాడి చేయడాన్ని బీసీ సమాజం సహించదని బీసీ సంఘాల నేత బొమ్మనబోయిన శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, సిబ్బందిపై జాగృతి నేతలు హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సోమవారం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్ ను కలిసి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ, ఇతర సామాజిక వర్గాలకు రాజకీయాల్లో ప్రయారిటీ దక్కాలని మల్లన్న పోరాటం చేస్తున్నారని తెలిపారు. కవిత ఆదేశాల మేరకు దాడి చేశారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత, దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.