మహబూబ్ నగర్ లో బీజేపీకి దూరమవుతున్న బీసీ నేతలు

మహబూబ్ నగర్ లో బీజేపీకి దూరమవుతున్న బీసీ నేతలు

మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు 16 లక్షల ఓటర్లు ఉండగా.. ఇందులో 53 శాతం మంది బసీలే. దీంతో ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ స్టేట్ ట్రెజరర్, బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత శాంతి కుమారి టికెట్ ఆశించారు.. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో టికెట్ తనకే వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. కానీ, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు హైకమాండ్ టికెట్ కేటాయించడంతో ఆయన అసంతృప్తికి లోనయ్యారు. పార్టీకి రాజీనామా చేయకపోయినా.. ప్రస్తుతం ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్కు దూరంగా ఉంటున్నారు.

 శాం తికుమార్కు టికెట్ రాలేదనే అసంతృప్తితో కొందరు బీసీ లీడర్లు పార్టీలోని తమ పదవుల కు రాజీనామా చేసి సైలెంట్ మోడ్లోకి వెళ్లిపో యారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల సెగ్మెంట్నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన జడ్పీ చైర్పర్సన్ సరిత బరిలో నిలిచారు. మహిళ, బీసీ వర్గానికి చెందిన నేత కావడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన చాలా మంది బీసీ లీడర్లు ఆమెకు మద్దతు పలికారు. పలు సర్వేలు కూడా ఆమె విజయం ఖాయమని తేల్చాయి. కానీ బీ ఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అరుణ అల్లుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి విజ యం సాధించారు. 

అల్లుడి కోసం అరుణ గద్వాలలో పోటీ నుంచి తప్పుకొని బలహీన మైన అభ్యర్థిని బరిలో నిలపడంతో పాటు ఆమె బహిరంగంగానే బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు పలికారనే ఆరోపణలు వచ్చాయి. ముక్కోణపు పోటీ జరగకుండా అరుణ కుట్ర పన్నడం వల్లే సరిత ఓడిపోయారనే అభిప్రాయం బీసీ నేతల్లో ఉంది. ఈ రెండు ఘటనలతో అరుణపై బీసీ వ్యతిరేక ముద్ర పడిందని, అందువల్లే ఒక్కొక్క రుగా బీసీ లీడర్లు పార్టీకి దూరమవుతున్నారనే