
కోల్‌బెల్ట్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే బిల్లుపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈనెల 18న నిర్వహించనున్న రాష్ట్ర బంద్‌ను సక్సెస్ చేయాలని సంఘం మందమర్రి పట్టణ కమిటీ అధ్యక్షుడు సకినాల శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నేరెళ్ల వెంకటేశ్, గౌరవ అధ్యక్షులు పోలు శ్రీనివాస్ కోరాడు. గురువారం మందమర్రి ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రంలో బీసీలను ఎన్నో ఏళ్లుగా అణిచివేస్తూ, హక్కులను కాలరాస్తున్న అగ్రవర్ణాల కుట్రల వల్లే 42 శాతం రిజర్వేషన్‌కు హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు విద్య, ఉద్యోగ, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించినప్పుడే బీసీ రాజ్యాధికారం సాధ్యమవుతుందని.. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని డిమాండ్‌చేశారు. రిజర్వేషన్ల సాధన కోసం చేపట్టే రాష్ట్ర బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. సమావేశంలో లీడర్లు బత్తుల సతీశ్ బాబు, రాంసాని శే ఖర్, బేర వేణుగోపాలరావు, దేవరపల్లి ప్రభాకర్, వై.రాజు, జమాల్ పూరి నర్సోజి తదితరులు పాల్గొన్నారు.
బంద్ కు మాస్ లైన్ మద్దతు
ఖానాపూర్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల18న బీసీ సంఘాలు ఇచ్చిన రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా రాష్ట్ర కార్యదర్శి నందిరామయ్య తెలిపారు. గురువారం ఖానాపూర్ లోని విశ్రాంతి భవనంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. జనాభా ప్రకారం రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల బిల్లును వెంటనే గవర్నర్, రాష్ట్రపతి పాస్ చే యాలని కోరారు. నాయకులు రాజన్న,శంకర్, సుదర్శన్, శ్రీనివాస్, గోరెమియా, రాజు తదితరులు పాల్గొన్నారు.
బంద్‌కు బీసీ సంఘాల మద్దతు
జైపూర్(భీమారం): ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు భీమారం మండలలోని అన్ని బీసీ సంఘాల నాయకులు సమావేశమై ఐక్య వేదిక తరఫున సంపూర్ణ మద్దతు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల జనాభా ప్రకారం రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.