బీసీ ఓవర్సీస్ స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు

బీసీ ఓవర్సీస్ స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు

బీసీ ఓవర్సీస్ స్కాలర్ షిప్ దరఖాస్తు తేదీని పొడిగించారు. ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియకు మార్చి 8వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. ఈ పథకం ద్వారా ఎంపికైన బీసీ విద్యార్థులు.. విదేశాల్లో చదివేందుకు ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. విద్యార్థులు వీసా, పాస్‌పోర్ట్ కాపీతో పాటు, ఆధార్‌కార్డు, స్థానికత, కుల, ఆదాయ, ఇతర అవసరమైన అన్ని సర్టిఫికేట్లను ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://telanganaepass.cgg.gov.inలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. బీసీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా పూలే బీసీ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2016 అక్టోబర్‌ 10న జి.ఓ.నెం.23 జారీ చేసింది. ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఈ స్కాలర్ షిప్ ద్వారా ఎక్కువమంది ఆస్ట్రేలియా, కెనడాల్లోని వర్సిటీల్లో విద్యను అభ్యసిస్తున్నారు.