వనపర్తి DCSOపై లోకాయుక్తలో ఫిర్యాదు.. కరెంట్ లేని రైస్ మిల్లులకు బియ్యాన్ని కేటాయిస్తున్నారని ఆరోపణ

వనపర్తి DCSOపై  లోకాయుక్తలో ఫిర్యాదు.. కరెంట్ లేని రైస్ మిల్లులకు బియ్యాన్ని కేటాయిస్తున్నారని ఆరోపణ

బషీర్​బాగ్, వెలుగు: వనపర్తి జిల్లా సివిల్ సప్లయ్ అధికారి కాశీ విశ్వనాథ్​పై హైదరాబాద్​లోని రాష్ట్ర లోకాయుక్తలో బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ మంగళవారం ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రూల్స్​ పాటిస్తున్న మిల్లులపై వివక్ష చూపుతూ మిషనరీ, కరెంట్ లేని రైస్ మిల్లులకు బియ్యాన్ని కేటాయిస్తున్నారని ఆరోపించారు. డీసీఎస్​వోపై గతంలో కలెక్టర్, విజిలెన్స్ డీజీ, సివిల్ సప్లయ్ కమిషనర్ కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయినా చర్యలు తీసుకోకపోవడంతో లోకాయుక్తను ఆశ్రయించినట్లు చెప్పారు.