కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీసీ సబ్‌‌‌‌‌‌‌‌ప్లాన్‌‌‌‌‌‌‌‌ తీసుకొస్తం : భట్టి విక్రమార్క

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీసీ సబ్‌‌‌‌‌‌‌‌ప్లాన్‌‌‌‌‌‌‌‌ తీసుకొస్తం : భట్టి విక్రమార్క

ధర్మసాగర్, వెలుగు : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీసీల కోసం ప్రత్యేకంగా సబ్‌‌‌‌‌‌‌‌ప్లాన్‌‌‌‌‌‌‌‌ చట్టం తీసుకొచ్చి, బీసీ బంధు అమలు చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ విజయం ఖాయమని, రాష్ట్రంలో గెలిచే మొట్టమొదటి సీటు స్టేషన్‌‌‌‌‌‌‌‌ ఘన్‌‌‌‌‌‌‌‌పూరే అన్నారు. పీపుల్స్‌‌‌‌‌‌‌‌ మార్చ్‌‌‌‌‌‌‌‌లో భాగంగా బుధవారం ధర్మసాగర్‌‌‌‌‌‌‌‌ మండలంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల కల్లాలను సందర్శించి, వారితో మాట్లాడారు.

అనంతరం ధర్మసాగర్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడుతూ రాష్ట్ర సంపదను దోపిడీ చేస్తున్న బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్ల వల్ల తెలంగాణ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారంలోకి రాగానే ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్‌‌‌‌‌‌‌‌రూమ్‌‌‌‌‌‌‌‌ ఇల్లు, గిట్టుబాటు ధర, పరిహారం, మూడు ఎకరాల భూమి అంటూ చెప్పి ఇప్పుడు వాటిని విస్మరించారని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీకే ప్రజలు అండగా ఉండాలని కోరారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి వచ్చాక కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, హనుమకొండ డీసీసీ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ నాయిని రాజేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, వరంగల్‌‌‌‌‌‌‌‌ పార్లమెంట్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి బండ్రు శోభారాణి, కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జి దొమ్మాటి సాంబయ్య పాల్గొన్నారు. కాగా బొల్లేపల్లి కృష్ణ, సింగపురం ఇందిర వర్గీయుల మధ్య గొడవ, తోపులాట జరగడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. స్థానిక నేతలు సర్దిచెప్పడంతో అందరూ శాంతించారు.