కెప్టెన్‌గా పాండ్యా.. వైస్ కెప్టెన్‌గా సూర్య.. వెస్టిండీస్‌తో తలపడబోయే భారత జట్టు

కెప్టెన్‌గా పాండ్యా.. వైస్ కెప్టెన్‌గా సూర్య.. వెస్టిండీస్‌తో తలపడబోయే భారత జట్టు

వెస్టిండీస్‌తో తలపడబోయే భారత టీ20 జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లతో కూడిన 15 మంది ఆటగాళ్లను ఇందుకు ఎంపిక చేసింది. ఈ జట్టుకు భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, మిస్టర్ ఇండియా 360 సూర్యకుమార్ యాదవ్  వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు. 

ఈ జట్టులో ఐపీఎల్ 2023 హీరోలైన యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, ముఖేష్ కుమార్‌లకు చోటు కల్పించారు. ఇండియా- వెస్టిండీస్ మధ్య ఆగష్టు 3 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి మూడు మ్యాచ్‌లు కరేబియన్ గడ్డపై జరగనుండగా, చివరి రెండు టీ20లు అమెరికా వేదికగా జరగనున్నాయి. 

భారత జట్టు(టీ20): హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్ మాన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్‌), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, ఆర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

మరిన్ని వార్తలు