జులన్‌‌ గోస్వామి రిటైర్మెంట్‌‌తో ఓ శకం ముగిసింది

జులన్‌‌ గోస్వామి రిటైర్మెంట్‌‌తో ఓ శకం ముగిసింది

న్యూఢిల్లీ: మహిళా క్రికెట్‌‌లో జులన్‌‌ గోస్వామి రిటైర్మెంట్‌‌తో ఓ శకం ముగిసిందని బీసీసీఐ వ్యాఖ్యానించింది. ఆమె రెండు దశాబ్దాల ఇంటర్నేషనల్‌‌ కెరీర్‌‌ను ‘స్మారక చిహ్నం’గా అభివర్ణించింది. ‘జులన్‌‌ ఓ గొప్ప ప్లేయర్‌‌. విమెన్స్‌‌ క్రికెట్‌‌కు స్ఫూర్తిదాయకం. దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని ఆమె ఎంతో  గౌరవంగా భావించింది. విశిష్ట సేవలందిస్తూ ఎప్పుడూ తన అత్యుత్తమ అడుగులు ముందుకేసింది. టీమిండియా పేస్‌‌ అటాక్‌‌కు ఆమె లీడర్‌‌.

జులన్‌‌ సాధించిన విజయాలు.. ప్రస్తుత, తర్వాతి తరం ప్లేయర్లకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ఫీల్డ్‌‌లో ఆమె లేకపోయినా.. ఆమె నెలకొల్పిన రికార్డులు రాబోయే తరాలను ప్రేరేపిస్తూనే ఉంటాయి’ అని బీసీసీఐ ప్రెసిడెంట్‌‌ సౌరవ్‌‌ గంగూలీ పేర్కొన్నాడు. విమెన్స్‌‌ క్రికెట్‌‌ను ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లిన వారిలో జులన్‌‌ కూడా ఒకరని సెక్రటరీ జై షా కితాబిచ్చాడు. మరోవైపు రాబోయే రోజుల్లో ఇండియా, వరల్డ్‌‌లో విమెన్స్‌‌ క్రికెట్‌‌కు తన వంతు సాయం అందిస్తానని లెజెండరీ పేసర్‌‌ జులన్‌‌ గోస్వామి వెల్లడించింది.