క్రికెట్ కోచ్ కోసం 3 వేల మంది దరఖాస్తు.. మోదీ, అమిత్ షా పేర్లతో అప్లయ్

క్రికెట్ కోచ్ కోసం 3 వేల మంది దరఖాస్తు.. మోదీ, అమిత్ షా పేర్లతో అప్లయ్

ఆన్ లైన్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత టూమచ్ టాలెంట్ బయటపడుతుంది. మొన్నటికి మొన్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ.. భారత్ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. అర్హత ఉన్న వారు అప్లయ్ చేసుకుంటే.. స్క్రూటినీ చేసి ఎంపిక చేస్తామనేది ఆ ప్రకటన సారాంశం.. ఆ ప్రకటన అలా వచ్చిందో లేదో.. ఇలా అప్లికేషన్లు వెల్లువెత్తాయంట..

ఓవరాల్ గా ఇప్పటి వరకు 3 వేల మంది భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ కోసం దరఖాస్తు చేసుకున్నారంట.. ఇక్కడే నెటిజన్లు తమ టాలెంట్ చూపించారు. ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్లు, ఫొటోలతో దరఖాస్తు పంపారంట.. అంతే కాదు సచిన్ టెండూల్కర్, ధోనీ పేర్లతోనూ అప్లికేషన్లు పెట్టారంట నెటిజన్లు.

టీ 20 ప్రపంచ కప్ జూన్ లో ముగిసిన తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కోచ్ ఎవరనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో పలువురు ఆస్ట్రేలియా క్రికెటర్లను సంప్రదించినట్టు,, వారు నిరాకరించినట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే వాటిలో వాస్తవం లేదని బీసీసీఐ సెక్రటరీ జైషా క్లారిటీ ఇచ్చాడు. 

భారత ప్రధాన కోచ్‌కు దేశవాళీ క్రికెట్‌ పట్ల అవగాహన ఉండటం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌దే అత్యంత ప్రతిష్టాత్మకమైన పాత్ర అని జైషా చెప్పుకొచ్చారు. ప్రధాన కోచ్ పాత్రకు ఎక్కువ అనుభవం ఉన్నవారి కావాలని బీసీసీఐ కార్యదర్శి అన్నారు. ఈ నెల ప్రారంభంలో BCCI టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పదవీ కాలం ఈ ఏడాది జూలై 1 నుండి ప్రారంభమై డిసెంబర్ 31, 2027తో ముగుస్తుంది.