క్రికెట్ వరల్డ్ కప్ 2023: సూపర్ స్టార్ రజినీకాంత్ కు బీసీసీఐ గోల్డెన్ టికెట్

క్రికెట్ వరల్డ్ కప్ 2023: సూపర్ స్టార్ రజినీకాంత్ కు బీసీసీఐ గోల్డెన్ టికెట్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్  ప్రస్తుతం జైలర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్లు వసూల్ చేసిన ఈ సినిమా తమిళ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు తలైవా 2023 ప్రపంచకప్‌కు ముందు గోల్డెన్ టిక్కెట్‌ను అందుకున్నారు.బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) సెక్రటరీ జయ్ షా తన అధికారిక హ్యాండిల్ ద్వారా  ప్రకటించారు.    దీంతో సూపర్ స్టార్‌కు VIP టిక్కెట్‌ అందుకున్న అరుదైన జాబితాలోకి చేరిపోయాడు. 

Also Read :- బిగ్గెస్ట్ క్రికెట్ ఫ్యాన్ కి భారీ నజరానా.. శ్రీలంక క్రికెట్ బోర్డు గొప్ప మనసు

ఈ లిస్టులో ఎవరెవరున్నారంటే.. 

ఇందులో భాగంగా తొలి గోల్డెన్ టిక్కెట్‌ను ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు అందించగా.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు కూడా ఈ టికెట్‌ దక్కింది. ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి భారత్ లో నిర్వహించబడుతుంది. ఇందుకోసం బీసీసీఐ ప్రత్యేక చొరవ తీసుకుంది. భారత్‌లోని ఐకాన్‌లకు ప్రత్యేక టిక్కెట్లు ఇవ్వాలని బోర్డు ప్లాన్ చేసి.. అందులో భాగంగా'గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్' అని పేరుతో ఓ  కార్యక్రమాన్ని  చేపట్టింది.