అలెర్ట్..ఆండ్రాయిడ్ యూజర్లకు మరో మాల్వేర్ ముప్పు.. గూగుల్ క్రోమ్ రూపంలో..

అలెర్ట్..ఆండ్రాయిడ్ యూజర్లకు మరో మాల్వేర్ ముప్పు.. గూగుల్ క్రోమ్ రూపంలో..

ఈ మధ్య కాలంలో మాల్వేర్ గురించి ఓ న్యూస్ విన్నాం. చూశాం..అదేంటంటే మొబైల్ స్క్రీన్ పై యాప్ ల లోగో రూపంలో మాల్వేర్ ఉంచడం ద్వారా విలువైన డేటాను హ్యాకర్లు దొంగిలిస్తున్నారు. మనం నిత్యం ఉపయోగించి కొన్ని యాప్ల లోగోల మాటున ఈ మాల్వేర్ థ్రెట్ను ఉంచడం ద్వారా సైబర్ నేరగాళ్లు మన డివైజ్ లోకి చొరబడి మన విలువైన సమాచారాన్ని దొంగిలించడం చేస్తున్నారు. అయితే ఇప్పుడు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ రూపంలో  ఈ మాల్వేర్ దాపురిస్తోంది. హ్యాకర్లు మాల్వేర్ థ్రెట్ ను డివైజ్ లోకి చొప్పించి  డేటా స్టీల్ చేస్తున్నారని Mcfee గూగుల్ ని హెచ్చరించింది. 

కొత్త మాల్వేర్  ఇప్పుడు ఆండ్రాయిడ్ వినియోగదారులకు భయపెడుతోంది. ఇది గూగుల్ క్రోమ్ నుంచి మీ మొత్తం సమాచారాన్ని దొంగిలించగలదు. Android మాల్వేర్ అనేక రూపాల్లో వస్తూనే ఉంది. తాజాగా మిలియన్ల కొద్ది యూజర్లు వినియోగించే క్రోమ్ బ్రౌజర్ రూపంలో వస్తోంది. ఇప్పుడు Chrome  వలే మారువేషంలో ఉన్న Android XLoader మాల్వేర్ కొత్త వెర్షన్ మేసేజ్ ద్వారా వినియోగదారుల డేటా స్టీల్ చేయగలదని తెలుస్తోంది. 

Android XLoader  మాల్వేర్ థ్రెట్ ఎట్లా  దాడి చేస్తుందంటే.. 

ఇది Website  URL తో కూడిన SMS మేసేజ్ ల ద్వారా మీ పరికరంలోకి చొరబడుతుంది. ఇచ్చిన లింక్ ద్వారా APK ఫైల్ తో ఇన్ స్టాల్ చేయబడుతుంది. ఒకసారి ఈ లింక్ ను క్లిక్ చేస్తే గూగుల్ Chrome ని రాసి ఉంటుంది. దీనిని నేరుగా ఇన్ స్టాల్ చేసుకోవాలని భ్రమపడతారు. అయితే మీరు యాప్ లను సెక్యూరిటీ లేని సోర్స్ నుంచి ఇన్ స్టా్ల్ చేయాలని ప్రయత్నించినప్పుడు ఇది మీ డివైజ్ లోకి ప్రవేశిస్తుంది. హ్యాకర్ దీనిని ఉపయోగించి యాప్ ల లోగో రూపంలో వెనక దాగి ఉండి మీ మేసేజ్ లను యాక్సెస్ పొందుతారు. దీంతో హ్యాకర్లు పాస్ వర్డ్ లు , ఫొటోలు, కాంటాక్ట్స్  వంటి కీలక సమాచారాన్ని మీ డివైజ్ నుంచి దొంగిలిస్తారు. 

Mcfee  ఇప్పటికే  ఈ మాల్వేర్ గురించి గూగుల్ తెలియజేసింది. దీంతో ఈ మాల్వేర్ తొలగింపునకు కంపెనీ చర్యలు చేపట్టింది.అయితే ప్లే స్టోర్ నుంచి తప్పా ఇతర అన్ సెక్యూర్డ్ సోర్స్ నుంచి ఇన్ స్టాల్ చేయొద్దని హెచ్చరించింది. ఇటువంటి వాటిని కంపెనీ బాధ్యత వహించదని తెలిపింది. అయినప్పటికి play Protct ని ఎనేబుల్ చేయడం ద్వారా వారి డేటాను డివైజ్ లనుంచి దొంగిలించకుండా కాపాడుకోవచ్చని గూగుల్ వినియోగదారులకు సూచించింది.