తొలిరోజే రైతు చట్టాల రద్దు బిల్లు

V6 Velugu Posted on Nov 27, 2021

సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో 26 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. వాటిలో రైతు చట్టాల రద్దు బిల్లు కూడా ఒకటి కావడం గమనార్హం. కాగా.. పార్లమెంట్ సమావేశాల మొదటిరోజైన సోమవారం రైతు చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. దాంతో తప్పకుండా సమావేశాలకు హాజరుకావాలని తమ పార్టీకి చెందిన లోక్‌సభ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది. రాజ్యసభ ఎంపీలకు గతంలోనే ఈ విప్ జారీ చేసింది. ఇదే క్రమంలో కాంగ్రెస్ కూడా లోక్‌సభ మరియు రాజ్యసభకు చెందిన తమ పార్టీ ఎంపీలందరికీ విప్ జారీ చేసింది.

Tagged Bjp, Farm Laws, Congress, Delhi, parliment, whip, Farm Bill

Latest Videos

Subscribe Now

More News