ఓట్లు చీల్చే ఒవైసీతో జాగ్రత్తగా ఉండండి

ఓట్లు చీల్చే ఒవైసీతో జాగ్రత్తగా ఉండండి

కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి

పశ్చిమ బెంగాల్: ఎంఐఎం పార్టీపై కాంగ్రెస్ మళ్లీ ఎదురుదాడి మొదలుపెట్టింది. మహారాష్ట్ర, కర్నాటకతోపాటు.. బీహార్ ఎన్నికల్లో ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా సెక్యులర్ శక్తులను ఒవైసీ బలహీనం చేసుకుంటూ వెళ్తున్నారన్న ఆరోపణల నేపధ్యంలో ఎంఐఎంపై మళ్లీ మాటల యుద్ధానికి తెరలేపింది. బీహార్ ఎన్నికల్లో బీజేపీ గెలువడానికి సెక్యులర్ ఓట్లను చీల్చింది ఎంఐఎం పార్టీయేనని.. ఇప్పటికైనా ఆ పార్టీతో లౌకికవాద పార్టీలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నేత అధీర్ రంజన్ చౌధురి ఆరోపించారు. బీహార్ ఎన్నికల ఫలితాలపై ముర్షిదాబాద్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీహార్ లో ఓట్లను చీల్చడానికి ఒవైసీ పార్టీని బరిలోకి దింపడంలో బీజేపీ విజయం సాధించిందని ఆరోపించారు. ఇకనైనా ఓట్లను చీల్చే (ఓట్ కట్టర్) ఒవైసీ సాహబ్ తో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.