తాళం దేవులాడకుండా ఇలా జాగ్రత్త పడుదాం.. 

తాళం దేవులాడకుండా ఇలా జాగ్రత్త పడుదాం.. 

బయటినుంచి ఇంట్లోకి వెళ్లగానే చేతిలోని వస్తువులు ఎక్కడపడితే అక్కడ పడేస్తాం. ముఖ్యంగా ఇంటి తాళం చెవులు, బండి తాళం చెవి. మరుసటి రోజు వాటికోసం తెగ వెతుకుతాం కానీ అవి దొరకవు.  తాళాల్ని ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఒక దగ్గర గోడకు తగిలిస్తే వెతికే పనే ఉండదు కదా. ‘అందంగా, ఇష్టంగా రంగురంగుల పెయింట్లు వేయించుకున్న గోడలకు తాళాలు వేలాడదీస్తే చూసేందుకు బాగోదు కదా’ అనిపిస్తుందా?. అందుకే, ఈ చెక్క ‘కీ’ హోల్డర్లపైన ఓ లుక్కేయండి. మన గోడల అందాన్ని రెట్టింపు చేసేలా ఉన్నాయి. అందమైన నెమలి, ఫ్లూట్‌, మ్యూజిక్‌ ఇనుస్ట్రుమెంట్స్‌ ఆకారాల్లో దొరుకుతున్నాయి. ‘కీ’ హోల్డర్‌‌గా కాకుండా వాటిపైన మొక్కలు కూడా పెట్టుకోవచ్చు. వాచ్‌లు, బెల్టులు పెట్టుకునేందుకు వీలుగా ఇంకొన్ని వెరైటీలు ఉన్నాయి. వీటికోసం ఎక్కడెక్కడో తిరిగి కొనాల్సిన పనిలేదు. అన్ని 
ఆన్‌లైన్‌ సైట్లలో తక్కువ ధరకే దొరుకుతున్నాయి.