
కోలీవుడ్ భామ మిర్నా మీనన్(Mirna Menon) బూరెల బుట్టలో పడింది. ఇటీవల ఆమె జైలర్(Jailer)లో నటించింది. ఇందులో రజనీకాంత్ కోడలి పాత్రలో మిర్నా కనిపించింది. ఈ బ్యూటీ గ్లామర్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇంత ట్యాలెంటెడ్ నటికి ఇలాంటి రోల్ ఇస్తారా? అంటూ నెట్టింట చర్చించుకుంటున్నారు.
ఇప్పుడు సోషల్ మీడియాలో మిర్నా ఫొటోలు ట్రెండింగ్‌గా మారాయి. టాలీవుడ్లో ఆది హీరోగా వచ్చిన ‘క్రేజీ ఫెల్లో’సినిమాలో నటించింది. ఇటీవల అల్లరి నరేశ్‌తో ‘ఉగ్రం’సినిమాతోనూ తన లక్‌ను చెక్ చేసుకుంది. తనకు రావాల్సిన గుర్తింపు మాత్రం జైలర్ సినిమాతోనే అందుకుంది.
సోషల్ మీడియాలో మిర్నా ఫాలోయింగ్ ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ లేటైనా సక్సెస్‌ను అందుకుంది. మరి జైలర్ హిట్ తో మిర్నా ఎలాంటి అవకాశాలను అందుకుంటుందో చూడాలి.