సడెన్ గా కనిపించకుండా పోతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..!

సడెన్ గా కనిపించకుండా పోతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..!

ఎన్నికల ముందు అధికార పార్టీలో కొందరు ఎమ్మెల్యేల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కదిలికలపై గులాబీ బాస్ నిఘా పెట్టినా..వాళ్ళు సడన్ గా మాయం అవుతున్నారట. ప్రతిక్షణం వెంట ఉండే గన్ మెన్లను వదలి ఎక్కడికో వెళ్తున్నారట. డ్రైవర్, అనుచనురులకు కూడా చెప్పకుండా వదిలేసి వెళ్లిపోతున్నారట. ఇలా ఎవరికి చెప్పకుండా సడెన్ గా మాయమవుతున్న వాళ్లల్లో కొందరు గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారట. కొంతమంది ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు కూడా ఈ లిస్టులో ఉన్నారట. హైదరాబాద్ కు వచ్చి కొన్ని గంటలు కనిపించకుండా పోతున్నారట. వీళ్లంతా ఎక్కడకు వెళ్తున్నారనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

ఉమ్మడి నల్లగొండ జిల్లా బార్డర్ నియోజక వర్గానికి చెందిన ఓ ఎమ్మెల్యే .. తన గన్ మెన్లు, డ్రైవర్ ని.. అసెంబ్లీలో వదిలేసి వెళ్లారట. నాలుగు గంటలైనా ఎమ్మెల్యే రాలేదట. ఎక్కడికి వెళ్లారో..ఎప్పుడు వస్తారో తెలియక గన్ మెన్లు పరేషాన్ అయ్యారట. సాయంత్రం వచ్చిన సదరు ఎమ్మెల్యే..తనవాళ్లను అసెంబ్లీ అవతలి రోడ్డువైపు రమ్మని...అక్కడి నుంచి వెళ్లిపోయారట. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యే కూడా.. తన గన్ మెన్లను బంజారా హిల్స్ BRS ఆఫీస్ లో వదిలేసి ఎక్కడికో వెళ్లారట. దాదాపు మూడు గంటల తర్వాత BRS ఆఫీస్ కు దూరంగా నిలబడి.. కారును పిలిపించుకొని వెళ్లిపోయారట ఆ ఎమ్మెల్యే. 

బీఆర్ఎస్ పార్టీలో ఆ ఎమ్మెల్యేల తీరుపై హాట్ హాట్ చర్చ జరుగుతోందంట. టికెట్ రాదని అనుమానం ఉన్న నేతలే ఎక్కడికో వెళ్లి వస్తున్నారట. టికెట్ వచ్చినా గెలిచే అవకాశం లేని ఎమ్మెల్యేలు కూడా ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్తున్నారట. వీళ్లందరూ ఎక్కడికి వెళ్లి వస్తున్నారనేదే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎలక్షన్ ఖర్చుల కోసం డబ్బులు సెటిల్ మెంట్ చేసుకుంటున్నారా..? లేదంటే టికెట్ కోసం ఇతర పార్టీల నేతలతో చర్చలకు వెళ్తున్నారా.. ? మరేదైనా కారణం ఉందా..? ఎమ్మెల్యేల తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోందట.