Bellamkonda Srinivas: లవ్లీ మూమెంట్స్‌తో బెల్లంకొండ ఎంగేజ్‌మెంట్.. శ్రీనివాస్–కావ్య రెడ్డి కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా

Bellamkonda Srinivas: లవ్లీ మూమెంట్స్‌తో బెల్లంకొండ ఎంగేజ్‌మెంట్.. శ్రీనివాస్–కావ్య రెడ్డి కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా

టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు, హీరో సాయి శ్రీనివాస్ ఒక ఇంటివాడు కాబోతున్నారు. త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆదివారం (ఏప్రిల్ 5,2026) రాత్రి హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో కావ్య రెడ్డితో ఎంగేజ్ మెంట్ జరిగింది. కాబోయే వధూవరులిద్దరూ కలర్‌ఫుల్ దుస్తుల్లో మెరిసిపోయారు.

ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అభిమానులు సోషల్ మీడియా వేదికగా కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. వీరి వివాహం ఏప్రిల్ 29న పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి సన్నిధిలో జరగబోతోంది. ఆధ్యాత్మిక వాతావరణంలో, అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ జంట ఒక్కటి కానుంది. అనంతరం మే 1న హైదరాబాద్‌లో సినీ రాజకీయ ప్రముఖుల కోసం భారీ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 

ఎవరీ కావ్య రెడ్డి?

గత నెలలోనే సాయి శ్రీనివాస్ తన కాబోయే భార్యను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశారు. కావ్య రెడ్డిది హైదరాబాద్‌లోని ఒక గౌరవప్రదమైన న్యాయవాదుల కుటుంబం. ఆమె తండ్రి ప్రముఖ అడ్వకేట్ కాగా, తాతగారు జడ్జిగా పనిచేశారు. సినిమా రంగానికి ఎటువంటి సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, సాయి శ్రీనివాస్‌తో ఆమెకు ఉన్న అనుబంధం పెద్దల అంగీకారంతో పెళ్లి పీటల వరకు చేరింది. 

బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త మూవీస్.. 

ఒకవైపు వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణం మొదలుపెడుతూనే, మరోవైపు జయాపజాయలతో సంబంధం లేకుండా కెరీర్ పరంగా కూడా శ్రీనివాస్ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన ‘హైందవ’ (Haindava) అనే భారీ ప్రాజెక్టులో నటిస్తున్నాడు. ఇది ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోంది.

హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో 'రాక్షసుడు' వంటి హిట్ అందుకున్న శ్రీనివాస్, ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని చూస్తున్నాడు. అలాగే, భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె.చంద్రతో ‘టైసన్ నాయుడు’ సినిమా చేస్తున్నాడు. అతి త్వరలోనే రిలీజ్ కానుంది.