యూట్యూబ్ లో బెల్లంకొండ వరల్డ్ రికార్డ్

యూట్యూబ్ లో బెల్లంకొండ వరల్డ్ రికార్డ్

బెల్లంకొండ శ్రీనివాస్.. థియేటర్ హీరోగా కంటే.. యూట్యూబ్ హీరోగా చాలా పాపులర్ అయ్యారు.. ఎంతలా అంటే ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేశారు. తెలుగులో సరైన సూపర్ హిట్ లేకపోయినా.. తాను తీసిన సినిమాలన్నీ హిందీలో సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. ఇక యూట్యూబ్ లో అయితే ప్రపంచ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. 

మాస్ డైరెక్టర్ బోయపాటి .. బెల్లంకొండ కాంబినేషన్ లో.. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా వచ్చిన జయ జానకీ నాయక మూవీ యూట్యూబ్ లో 709 మినియన్ వ్యూస్ తో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచంలో 709 మిలియన్ వ్యూస్ వచ్చిన తొలి సినిమాగా నిలిచింది. కేజీఎఫ్ హిందీ వెర్షన్ కూడా 702 మినియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి. బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో నటించకపోయినా.. డబ్బింగులతో అక్కడి ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యాడు. బెల్లంకొండ నటించిన మరో సినిమా సీత కూడా 500 మిలియన్ వ్యూస్ తో దుమ్మురేపింది. 

యూట్యూబ్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన జయ జానకీ నాయక మూవీ 2017లో ఆగస్టులో ధియేటర్లలో రిలీజ్ అయ్యింది. తెలుగులో బాగానే ఆడింది. టీవీల్లోనూ మంచి రేటింగ్ వచ్చింది. యూట్యూబ్ లో అయితే ఏకంగా ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు బెల్లంకొండ హిందీలో ఛత్రపతి చేస్తున్నాడు. యూట్యూబ్ పాపులారిటీతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.