ఖబడ్దార్ దుర్గం చిన్నయ్య.. నీ అవినీతి అక్రమాల చిట్టా బయటకు లాగుతా : గడ్డం వినోద్

ఖబడ్దార్ దుర్గం చిన్నయ్య.. నీ అవినీతి అక్రమాల చిట్టా బయటకు లాగుతా : గడ్డం వినోద్

బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దుర్మార్గాలను బెల్లంపల్లి ప్రజలు భరించలేకపోతున్నారని ఆరోపించారు. దుర్గం చిన్నయ్య తమకు వద్దు అని అంటున్నారని చెప్పారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో పలు వార్డుల్లో గడ్డం వినోద్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు.  

ఖబడ్దార్ దుర్గం చిన్నయ్య... నీ అవినీతి అక్రమాల చిట్టా బయటకు లాగుతా అని హెచ్చరించారు గడ్డం వినోద్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత దుర్గం చిన్నయ్య అక్రమాలపై విచారణ చేయిస్తానని చెప్పారు. తాను రాజకీయాల్లోకి ప్రజా సేవ చేయడం కోసమే వచ్చానని, సంపాదించుకోవడం కోసం కాదని స్పష్టం చేశారు. తాను నిస్వార్ధంగా బెల్లంపల్లి నియోజకవర్గం అభివృద్ధి కోసం శాయశక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు.