ఎమ్మెల్యే చిన్నయ్య క్యాంప్ ఆఫీస్ ఎదుట శేజల్ ఆందోళన

ఎమ్మెల్యే చిన్నయ్య క్యాంప్ ఆఫీస్ ఎదుట శేజల్ ఆందోళన

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్యాంప్ ఆఫీస్ ఎదుట ఆరిజిన్ డైరీ సీఈఓ శేజల్ ఆందోళనకు దిగారు. చిన్నయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఆరు నెలలుగా హైదరాబాద్, ఢిల్లీలో ఆందోళన కొనసాగించిన ఆమె ఇప్పుడు బెల్లంపల్లికి వచ్చారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలని క్యాంప్ ఆఫీస్ ఎదుట బైఠాయించారు. 

పోలీసులు శేజల్ ను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఎమ్మెల్యే చిన్నయ్య మూడు రోజుల క్రితం చెన్నై వెళ్లారు.