వనపర్తికి బెంగాల్ లేబర్​

వనపర్తికి బెంగాల్ లేబర్​

వనపర్తి, వెలుగు: వనపర్తి ప్రాంతంలో యాసంగి నాట్లు ప్రారంభమయ్యాయి. మహిళా కూలీలే నాట్లు వేస్తుండడంతో వారికి డిమాండ్ ఏర్పడింది. ఎకరం నాటేసేందుకు రూ.6 వేలు డిమాండ్  చేస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కూలీలకు రైతులు ప్రాధాన్యత ఇస్తున్నారు. పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ ఘడ్, బీహార్  రాష్ట్రాలకు చెందిన పురుష కూలీలు జిల్లాకు వచ్చి వరి నాట్లు వేస్తున్నారు. 

వారు ఇక్కడి మహిళా కూలీలతో పోటీ పడి పనులు చేస్తున్నారు. ఎకరం పొలం నాటు వేసేందుకు రూ. 4 వేలు తీసుకుంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనులు చేస్తున్నారు. నారు మోయడం, డీఏపీ చల్లడం వంటి పనుల్లో రైతులకు సాయం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పురుషులు వరి నాట్లు వేయడం చూసి మహిళలతో పాటు రైతులు ముక్కున వేలేసుకుంటున్నారు.