
బెంగళూరు..సిలికాన్ వ్యాలీ..భారతదేశపు రెండో ఆర్థిక రాజధాని..IT ,స్టార్టప్ పరిశ్రమలకు ప్రధాన కేంద్రం..సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో అత్యధిక వాటా ఉన్న నగరం.ఇప్పుడు మరో రికార్డు బ్రేక్ చేసింది. ప్రపంచంలోనే టాప్ టెక్నాలజీ హబ్ లో ఒకటిగా రికార్డుల్లోకి ఎక్కింది. అత్యధిక ఉద్యోగులున్న ఐటీ హబ్ గా నిలిచింది.
రియల్ ఎస్టేట్ కన్సల్టేన్సీ CBRE రిపోర్టు ప్రకారం..10లక్షల మంది (1మిలియన్) సాఫ్ట్ వేర్ ఉద్యోగుల మైలురాయిని దాటేసి ప్రపంచంలోనే టాప్ 12 టెక్నాలజీ హబ్ లలో ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 115 మార్కెట్‌లను లభ్యత, నాణ్యత ,టెక్ ప్రతిభ ఖర్చు ఆధారంగా 'గ్లోబల్ టెక్ టాలెంట్ గైడ్‌బుక్ 2025' రూపొందించిన రిపోర్టులో బెంగళూరును వరల్డ్ టాప్ ఐటీ హబ్ గా ప్రకటించింది.
ALSO READ | ఉబెర్ బుక్ చేసిన మహిళ.. పిక్ చేసుకోవటానికి టీమ్ లీడ్ రావటంతో షాక్..! ఏమైందంటే..
ఈ రిపోర్టు.. బెంగళూరును 12 ప్రపంచ "పవర్‌హౌస్" టెక్ మార్కెట్లలో ఒకటిగా గుర్తించింది. బీజింగ్, బోస్టన్, లండన్, న్యూయార్క్ మెట్రో, పారిస్, శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా, సీటెల్, షాంఘై, సింగపూర్, టోక్యో ,టొరంటో వంటి ప్రపంచ దిగ్గజాల సరసన బెంగళూరు చేరింది.
బీజింగ్ ,షాంఘైలతో పాటు ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో బెంగళూరు అతిపెద్ద టెక్ టాలెంట్ మార్కెట్. దాని టెక్ వర్క్‌ఫోర్స్ 1 మిలియన్ (10 లక్షలు) మించిపోయింది" అని రిపోర్టు పేర్కొంది. ప్రపంచ ఆవిష్కరణలో బెంగళూరుది కీలక పాత్ర అని తెలిపింది. దేశంలోని ఇ తర నగరాలు కూడా ఐటీ రంగంలో దూసుకుపోతున్నాయి. ఢిల్లీ--ఎన్‌సిఆర్, ముంబై, అహ్మదాబాద్ ,జైపూర్ వంటి నగరాల్లో ఐటీ డెవలప్ ఆశాజనకంగా ఉంది.
ఇంకా AI ప్రతిభ డెవలప్ మెంట్ బెంగళూరు పెద్దన్నగా నిలిచింది. శాన్ ఫ్రాన్సిస్కో ,న్యూయార్క్ వంటి ప్రముఖ US టెక్ క్లస్టర్‌లతో సమానంగా AI నిపుణుల అత్యధికంగా నగరంగా బెంగళూరు రికార్డు సృష్టించింది. జనాభాపరంగా బెంగళూరు 12 పవర్‌హౌస్‌లలో నాల్గవ స్థానంలో ఉంది.
AI, డేటాసైన్స్, ఇంజనీరింగ్ లలో స్కిల్స్ ఉన్న నిపుణులు, టాప్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు(GCC) లు బెంగళూరును ప్రపంచ టాప్ టెక్నాలజీ హబ్ ల సరసన నిలబెట్టాయి. అంతేకాదు టెక్ ఉపాధిలో 2018నుంచి 2023 మధ్య కాలంలో 12 శాతం పెరుగుదలకు దారితీశాయి.