పట్టుబడిన చిరుత చచ్చిపోయింది

పట్టుబడిన చిరుత చచ్చిపోయింది

బెంగళూరు వాసులను ఐదు రోజులుగా నిద్రలేకుండా చేసిన అంతుచిక్కని  చిరుతపులిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. కానీ అది చచ్చిపోయింది.  చిరుతపులి నగరంలో సంచరిస్తూ జనాలను భయభ్రాంతులకు గురిచేస్తుంది.  దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీల్లో రికార్డ్​ అయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న  అటవీ శాఖ సిబ్బంది చిరుతపులిని పట్టుకునేందుకు  బోనులను ఏర్పాటు చేశారు. వారి ప్రయత్నాలు  2023 నవంబర్ 1న ఫలించాయి.  

అడవి నుండి తప్పిపోయిన చిరుతపులిని పట్టుకునే క్రమంలో అటవీ శాఖ అధికారిపై దాడికి యత్నించింది. ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలోని కుడ్లు గేట్ వద్ద చిరుతపులిని పట్టుకున్నారు అటవీ శాఖ అధికారి ఒకరు.  ఈ క్రమంలో చిరుత ఎటాక్ చేయడంతో అతను అత్మరక్షణ కోసం దానిపై  కాల్పులు జరిపాడు. చిరుతకు బుల్లెట్ గాయం కావడంతో  బన్నెరఘట్ట బయోలాజికల్ పార్క్‌లోని వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిరుత మరణించింది. 

వన్యప్రాణుల వల్ల మనుషుల ప్రాణాలకు ముప్పు వాటిల్లితే అత్మరక్షణ కోసం కాల్చడానికి తమకు అనుమతి ఉందని,  బెంగళూరు అర్బన్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎస్ఎస్ లింగరాజు తెలిపారు.