మెహిదీపట్నం, వెలుగు: నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్(హెచ్ఎన్ఈడబ్ల్యూ), మాసబ్ ట్యాంక్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి డ్రగ్స్ ను పట్టుకున్నారు. సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన ఎజాజ్ అహ్మద్ డ్రగ్ పెడ్లర్. శుక్రవారం రాత్రి మాసబ్ ట్యాంక్ పరిధిలోని రోడ్ నంబర్ 12 వద్ద డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
అతని వద్ద నుంచి 35 గ్రాముల కొకైన్, 11 గ్రాముల ఎండీఎంఏ, 5 గ్రాముల ఓజీ, 15 ఎక్స్టసీ ట్యాబ్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.12 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితుడు ఎజాజ్ అహ్మద్ ను అరెస్ట్‌చేసి, శనివారం రిమాండ్ కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.
