కంటి కింద ఉబ్బు తగ్గట్లేదా!

కంటి కింద ఉబ్బు తగ్గట్లేదా!

నిద్రలేకపోతే కంటి కింద ఉబ్బు వస్తుందన్న మాట నిజమే. కానీ, కళ్ల ఉబ్బుకు​ ఇదొక్కటే కారణం కాదు. మనం తెలియక చేసే పొరపాట్లు కూడా ఇందుకు కారణం. అవేంటంటే..   ఉప్పు ఎక్కువ తింటే చర్మం తేమని అబ్జార్బ్​ చేసుకోలేదు. దానివల్ల చర్మం పొడిబారి కళ్లకింద డార్క్​ సర్కిల్స్​ వస్తాయి. కళ్ల కింద ఉబ్బుతుంది. 
దిండు కవర్లని ఉతక్కుండా ఎక్కువ రోజులు వాడినా..  కంటి కింది చర్మం నల్లగా మారి, ఉబ్బినట్లు అవుతుంది.  ​మేకప్​ ప్రొడక్ట్స్​లోని కెమికల్స్​ వల్ల కూడా కళ్లు ఉబ్బుతాయి. అందుకే రసాయనాలు ఎక్కువగా ఉన్న ప్రొడక్ట్స్​ వాడకూడదు​. ఒకవేళ వాడుతుంటే కనుక రాత్రి నిద్రపోయేముందు మేకప్​ తీయడం కంపల్సరీ. అలాగే అదే పనిగా కంప్యూటర్‌, ఫోన్లు చూసినా డార్క్​ సర్కిల్స్​ వస్తాయి.