డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్ ఓటమికి మూడు కారణాలు

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్ ఓటమికి మూడు కారణాలు

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్ నిరాశపర్చింది. కప్ కొడతారని ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశలను నీరుగార్చారు. దీంతో అభిమానులతోపాటు సీనియర్ క్రికెటర్లు టీమిండియా ప్లేయర్ల ఆటతీరుపై పెదవి విరుస్తున్నారు. భారత్ తన బలాబలాకు తగ్గట్లుగా ఆడి ఉంటే ఫలితం మరోలా ఉండేదని వెటరన్‌లు అంటున్నారు. ఈ నేపథ్యంలోఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌‌మన్ మైకేల్ బెవాన్ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత ఓటమికి మూడు కారణాలను విశ్లేషించాడు. ఇంగ్లీష్ కండీషన్స్‌కు అలవాటు పడేందుకు భారత జట్టుకు సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లభించకపోవడం మొదటి కారణమని బెవాన్ చెప్పాడు. కీలక మ్యాచ్‌కు ముందు కేవలం ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ చేయడం టీమిండియా ప్లేయర్ల సన్నాహకానికి సరిపోకపోవడం రెండో కారణమన్నాడు. చివరి రోజు ఆటలో డ్రా లేదా ఓటమి ఆప్షన్స్ మాత్రమే భారత్ ముందున్నాయని.. దీంతో జట్టు తీవ్ర ఒత్తిడిలో పడిందన్నాడు.