
భవానీపూర్ ఉప ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 58,832 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను గెలిపించిన భవానీపూర్ ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని అన్నారు. నందిగ్రామ్‌లో తనపై కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్రలను భవానీపూర్ ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. తనను అధికారం నుంచి దించేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎడతెగని ప్రయత్నాలు చేసిందన్నారు మమత. నందిగ్రామ్‌లోనూ తనను ఓడిచేందుకు కుట్ర జరిగిందన్నారు. తనను ఎన్నికలకు దూరంగా ఉంచేందుకు దాడి చేశారని మమత ఆరోపించారు.
దేశంలోని ప్రతి ప్రాంతానికి చెందిన వాళ్లుండే భవానీపూర్‌లో తనను గెలిపించినందుకు భారతీయులందరికీ ధన్యవాదాలు అని చెప్పారు మమతా బెనర్జీ. 2016లో తనకు కొన్ని వార్డుల్లో తక్కువ ఓట్లు వచ్చాయని, ఈ నియోజకవర్గంలో 46 శాతం ఓటర్లు నాన్ బెంగాలీలని, ఇప్పుడు ప్రతి ఒక్కరూ తనకు ఓటు వేశారని ఆమె అన్నారు.తనకు ఓటేసినందుకు ప్రజలకు, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆరు నెలల్లోపే ఎన్నికలు నిర్వహించినందుకు ఈసీకి థ్యాంక్స్ చెప్పారు.