కేసీఆర్.. నీ పార్టీకి డిపాజిట్ కూడా రాదు

కేసీఆర్.. నీ పార్టీకి డిపాజిట్ కూడా రాదు

కరీంనగర్: తెలంగాణను పాలించే నైతిక హక్కును కేసీఆర్ ఎప్పుడో కోల్పోయారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జమ్మికుంట ఎంపీఆర్ గార్డెన్‌‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, చేనేత కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని.. లేదంటే కేసీఆర్ రాజీనామా చేయాలని ఛాలెంజ్ చేశారు. 

‘హుజురాబాద్‌లో నన్ను ఓడించేందుకు ఆరుగురు మంత్రులు, పదుల కొద్దీ ఎమ్మెల్యేలు ఐదు నెలలుగా కుట్రలు పన్నుతున్నారు. రూ.4 వేల కోట్లు ఖర్చు చేసి నన్ను ఓడించి.. మరో 20 ఏళ్లు తెలంగాణను బానిసత్వంలో ముంచేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. లేవలేనోడు, చేతగానోడు నా మీద ఇష్టమొచ్చినట్లుగా ఆరోపణలు చేస్తున్నారు. నేను ధీరుడిలా పోరాడి గెలుస్తా. కేసీఆర్.. నీకు దమ్ముంటే లిక్కర్, డబ్బులు పంచకుండా గెలువు. నీ పార్టీకి ఇక్కడ డిపాజిట్ కూడా రాదు. అక్టోబర్ 30న టీఆర్ఎస్ పార్టీకి దిమ్మతిరిగే తీర్పు ఇవ్వాలె’ అని ఈటల ప్రజలను కోరారు.  

మరిన్ని వార్తల కోసం: 

కేసీఆర్ మీ అందరికీ భర్త లాంటోడు

సమంతకు అక్కినేని ఫ్యామిలీ రూ.200 కోట్లు ఆఫర్?

షిప్‌లో రేవ్ పార్టీ.. ప్రముఖ హీరో కొడుకు అరెస్ట్!

మరోసారి పేరు మార్చుకున్న సమంత