భద్రాచలం బ్రహ్మోత్సవాల ఇన్‌‌కం రూ.1.89 కోట్లు

భద్రాచలం బ్రహ్మోత్సవాల ఇన్‌‌కం రూ.1.89 కోట్లు

భద్రాచలం, వెలుగు : భద్రాచల సీతారామచంద్రస్వామి ఆలయంలో గత నెల 9 నుంచి 23 వరకు జరిగిన బ్రహ్మోత్సవాల టైంలో స్వామి వారికి రూ.1,89,61,124ల ఆదాయం వచ్చింది. ఇందులో సెక్టార్‌‌‌‌ టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.93,01,450, పరోక్ష సేవ టికెట్లు (రూ.5 వేలు) ద్వారా రూ.2.85 లక్షలు, (రూ.1116) టిక్కెట్ల ద్వారా రూ.4,39,704లు, అంతరాల సేవా టికెట్ల ద్వారా రూ.91,170, పోస్టల్‌‌‌‌ ద్వారా తలంబ్రాల ప్యాకెట్లు పంపడంతో రూ.75,930, ఆర్టీసీ కార్గో తరఫున తలంబ్రాల ప్యాకెట్లు విక్రయాల ద్వారా రూ.23.20 లక్షలు, టెంపుల్‌‌‌‌ కౌంటర్ల వద్ద తలంబ్రాల ప్యాకెట్లు విక్రయించడం ద్వారా రూ.7,87,950 వచ్చాయి. అలాగే చిన్న లడ్డూ ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.49,14,250లు, మహా లడ్డూ అమ్మకం ద్వారా రూ.7,45,100లు ఆదాయం వచ్చినట్లు ఆఫీసర్లు చెప్పారు. గత సంవత్సరం బ్రహ్మోత్సవాలకు రూ. 2,63,20,282 ఆదాయం రాగా ఈ సారి 73,59,158ల ఇన్‌‌‌‌కం తక్కువ వచ్చింది. 

ఖర్చు రూ.2.37 కోట్లు

భద్రాచలం బ్రహ్మోత్సవాల కోసం చేసిన ఖర్చుకు, వచ్చిన ఆదాయానికి పొంతన లేకుండా పోయింది. బ్రహ్మోత్సవాల కోసం ఆలయం తరఫున రూ.2,37,30,121 ఖర్చు చేశారు. కానీ ఆదాయం మాత్రం రూ.1,89,61,124 రావడంతో రూ.47,68,997 లోటు ఏర్పడింది.