భద్రాద్రి రామయ్య భక్తులకు శుభవార్త... కళ్యాణం టిక్కెట్లు ఆన్​ లైన్​లో

 భద్రాద్రి రామయ్య భక్తులకు శుభవార్త...   కళ్యాణం టిక్కెట్లు ఆన్​ లైన్​లో

 దక్షిణాది అయోధ్య భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఈ  నెల 17న శ్రీరామనవమి (Sri Rama Navami) సందర్భంగా కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన సెక్టార్‌ టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు.

శ్రీరామ నవమి(Sriramanavami)కి భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఏటా రాములోరి కల్యాణం ఎంతో కన్నుల పండువగా, కమనీయంగా నిర్వహిస్తారు. ఈసారి కూడా అంతే వైభవంగా రాములవారి కల్యాణం జరిపించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు ఆలయ అధికారులు. అయితే స్వామి కల్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించాలనే కోట్లాది భక్తులు భావిస్తారు. అయితే ఆ అనుగ్రహం అతి తక్కువ మందికి మాత్రమే లభిస్తుంది. అయితే అలాంటి అద్భుతమైన అవకాశం ఈసారి అందరికి వచ్చింది. ఈసారి ఏప్రిల్ 17న(April) భద్రాద్రిలో సీతరాముల కల్యాణాన్ని కనులారా చూడాలనుకునే భక్తులకు సెక్టార్ టికెట్ల(Sector Tickets)ను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచింది దేవస్థానం. శ్రీరామనవమి రోజున ఉభయ దాతలు కల్యాణ మహోత్సం తిలకించేందుకు టికెట్ ధరను రూ.7500గా పేర్కొంది. ఈ టికెట్ పై ఇద్దరికి ప్రవేశం ఉంటుంది. రూ.2500, రూ.2000, రూ.1000, రూ.300, రూ.150 టికెట్లపై ఒక్కరికి ప్రవేశం కల్పిస్తారు. ఇవే టికెట్లను నేరుగా కూడా కొనుగోలు చేయవచ్చని దేవస్థానం ప్రకటించింది. ఆన్ లైన్ లో సెక్టార్ టికెట్స్ పొందిన వారు ఏప్రిల్  17వరకు ఉదయం 6గంటల నుంచి తానీషా కల్యాణ మండపంలో ఒరిజినల్ ఐడీ కార్డ్స్ చూపించి టికెట్లు పొందాల్సి ఉంటుందని తెలిపింది దేవస్థానం.స్వామి వారి కల్యాణం రోజున ప్రత్యక్షంగా రాలేని భక్తులు పరోక్ష పద్ధతిలో తమ గోత్రనామాలతో పూజ చేయించే వెసులుబాటునూ కూడా కల్పించారు. దీని కోసం రూ.5 వేలు, రూ.1116 టికెట్లనూ వెబ్‌సైట్‌ నుంచి బుక్‌ చేసుకోవచ్చు.

 పట్టాభిషేకం టికెట్లు ..

ఆన్ లైన్ టికెట్లు వద్దనుకునే వారు, స్థానికులకు  టికెట్లను నేరుగా పొందే సదావకాశాన్ని కల్పిస్తోంది దేవస్థానం. కల్యాణం అనంతరం మరుసటి రోజున అనగా 18న రాములవారి పట్టాభిషేకం ఉంటుంది. దీన్ని చూడాలనుకునే భక్తులు కోసం రూ. 1500, రూ. 500, రూ.100 టికెట్లను ప్రకటించింది. వీటిని కూడా ఆన్ లైన్ లో పొందవచ్చు. ఈ టిక్కెట్లను https://bhadradritemple.telangana.gov.in వెబ్‌సైట్ లో లాగిన్ అయ్యి టికెట్లు పొందవచ్చు. కల్యాణం రోజున రావడం వీలుకాని భక్తులు రూ. 5 వేలు, రూ. 116 టికెట్లతో పరోక్ష పద్ధతిలో గోత్రనామాలతో పూజ చేయించుకోవచ్చు. ఈ టికెట్లు కూడా వెబ్‌సైట్‌ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

టికెట్ లభించే కేంద్రాలు..

ఆఫ్​లైన్ ద్వారా  నేరుగా టికెట్లు కొనుగోలు చేయాలనుకున్న వారు  భద్రాచలం రామాలయం, తానీషా కల్యాణ మండపం, గోదావరి బ్రిడ్జ్ సెంటర్‌లోని ఆలయ విచారణ కేంద్రం, ఆర్డీవో కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో నేరుగా విక్రయించనున్నారు. కల్యాణ తలంబ్రాలను ఇంటికే ఆర్టీసీ కార్గో సర్వీసు ద్వారా పంపినట్లుగానే ఈసారి అలాగే రాములవారి కల్యాణంలోని ముత్యాల తలంబ్రాలను కూడా కొరియర్ చార్జీ చెల్లిస్తే ఇంటికే పంపించే ఏర్పాట్లు చేస్తోంది.ఈ సదుపాయాన్ని భక్తులు వినియోగించుకోవాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.