భద్రాద్రి హుండీ ఇన్‌కం రూ.1.68 కోట్లు

భద్రాద్రి హుండీ ఇన్‌కం రూ.1.68 కోట్లు

భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ హుండీలను బుధవారం లెక్కించారు. 41 రోజులకుహుండీల ద్వారా రూ. 1,68,54,129 ఆదాయం వచ్చిందని ఈవో రమాదేవి తెలిపారు.

అలాగే, 557 యూఎస్‌ డాలర్స్‌, 5 ఖతార్‌ రియాల్స్‌, 20 ఇంగ్లాండ్‌ పౌండ్స్‌, 20 పిలిప్పైన్స్‌ పిసోలు, 950 నేపాల్‌ రూపీస్‌, 20 యూఏఈ దిర్హాన్స్‌, 14 మలేషియా రింగ్ట్స్, 60 ఆస్ట్రేలియన్‌ డాలర్స్, 20 కెనడా డాలర్స్ వచ్చినట్లు చెప్పారు. లెక్కింపులో దేవస్థాన ఉద్యోగులు పాల్గొన్నారు.