భద్రాద్రి ముక్కోటి ఆదాయం రూ.60.19 లక్షలు

భద్రాద్రి ముక్కోటి ఆదాయం రూ.60.19 లక్షలు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానానికి ముక్కోటి ఏకాదశి సందర్భంగా రూ.60.19 లక్షల ఆదాయం సమకూరింది. గత ఏడాది 91,768 మంది భక్తులు రాగా, ఈ ఏడాది 1,54,277 మంది భక్తులు ముక్కోటి ఏకాదశి సందర్భంగా దర్శనం చేసుకున్నారు. ఈ సారి 98.48 శాతం టికెట్లు అమ్ముడయ్యాయి.

 సెక్టార్​ టికెట్ల ద్వారా రూ.37.62 లక్షలు, పరోక్ష సేవల టికెట్ల ద్వారా రూ.26 వేలు, వీఐపీ స్పెషల్  దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.3.89 లక్షలు, స్పెషల్  దర్శనం టికెట్ల ద్వారా రూ.2.93 లక్షలు, చిన్న ప్రసాదం లడ్డూల ద్వారా రూ.12.38 లక్షలు, మహాప్రసాదం లడ్డూల ద్వారా రూ.2.40 లక్షలు, పులిహోర, చక్కెర పొంగలి ద్వారా రూ.69.88 వేల ఆదాయం వచ్చినట్లు ఈవో ఈవో దామోదర్​రావు తెలిపారు. ఆర్టీసీకి సైతం రూ.57లక్షల ఆదాయం వచ్చింది.