అమెరికాలో సీతారాముల కల్యాణం

అమెరికాలో సీతారాముల కల్యాణం

భద్రాచలం, వెలుగు :  అమెరికాలోని సియాటిల్​ నగరంలో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం సోమవారం వైభవంగా జరిగింది. ప్రవాస భారతీయులు ఈ తంతును నిర్వహించారు. వారి విజ్ఞాపన మేరకు ప్రభుత్వ అనుమతితో దేవస్థాన అర్చకులు రామస్వారూపాచార్యులు అక్కడికి వెళ్లారు. విష్ణువర్ధనాచార్యులు, శ్రావణకుమాచార్యులు ఈ క్రతువును చేపట్టారు. 

సీతారాముల ఎదుర్కోలు ఉత్సవంతో పాటు, కల్యాణంలో పాల్గొని భక్తులు తరించారు. కల్యాణానికి పలువురు భక్తులు పట్టు వస్త్రాలు సమర్పించారు. కాగా, సోమవారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి ముత్తంగి సేవ నిర్వహించారు. 58 జంటలు కంకణాలు ధరించి నిత్య కల్యాణంలో పాల్గొన్నాయి.