‘దంచవేమేనత్త కూతురా’ సాంగ్ యాడ్

‘దంచవేమేనత్త కూతురా’ సాంగ్ యాడ్

‘బనావో బేటికో షేర్ అనే గొప్ప సందేశంతో తీసిన ‘భగవంత్ కేసరి’ చిత్రం దసరా నవరాత్రుల్లో విడుదలై సక్సెస్ సాధించడం సంతోషంగా ఉంది’ అన్నారు బాలకృష్ణ. సోమవారం ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సినిమా కోసం ‘దంచవేమేనత్త కూతురా’ పాటని గ్రాండ్‌‌గా తీశామని, ఇప్పుడా పాటని సినిమాలో యాడ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది, నటీనటులు శ్రీలీల, అర్జున్ రాంపాల్, జయచిత్ర, మురళీధర్ గౌడ్, జీవన్,  శ్రవణ్, భరత్ రెడ్డి, సంగీత దర్శకుడు తమన్, లిరిక్ రైటర్స్ రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, డీవోపీ రామ్ ప్రసాద్, ఫైట్ మాస్టర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.