భగవంత్ కేసరి ఫస్ట్ సింగిల్ అప్డేట్.. స్పీకర్స్ పగిలిపోవడం కన్ఫర్మ్!

భగవంత్ కేసరి ఫస్ట్ సింగిల్ అప్డేట్.. స్పీకర్స్ పగిలిపోవడం కన్ఫర్మ్!

నటసింహ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి(Bhagavanth Kesari). కాజల్ అగర్వాల్(Kajal agarwal), శ్రీలీల(Sreeleela) కీ రోల్లో కనిపిస్తున్న ఈ సినిమా.. కోసం బాలయ్య అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. భగవంత్ కేసరి పాటల నగరా వినిపించడానికి మేకర్స్ రెడీ అయ్యారని సమాచారం.ఆగస్టు 31న ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. భగవంత్ కేసరి టీజర్ లో వచ్చిన టైటిల్ సాంగ్ ఫస్ట్ సింగిల్ అని తెలుస్తోంది.గణ గణ గణేశా..!! అంటూ వచ్చే ఈ సాంగ్ తో స్పీకర్స్ పగిలిపోవడం కన్ఫర్మ్ అంటున్నారు మేకర్స్. 

ఇక రెండో సింగిల్ ను సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ మూవీ అక్టోబర్ 19న రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలో భగవంత్ కేసరి ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా కండక్ట్ చేయడానికి అనిల్ రావిపూడి రెడీ అయ్యినట్టు టాక్. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన టీజర్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఫస్ట్ ఊరమాస్ ఫిల్మ్ బాలయ్యతో కావడం విశేషం.  

ఇక భగవంత్ కేసరి సినిమా విషయానికి వస్తే..షైన్ స్క్రీన్(Shine screen) పతాకంపై సాహు గరికపాటి(Sahu garikapati) నిర్మిస్తున్న ఈ సినిమాలో.. కాజల్ అగర్వాల్(Kajal Agarwal) హీరోయిన్ గా నటిస్తుండగా..లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) బాలకృష్ణకు కూతురిగా కనిపించనుంది. తమన్(Thaman) సంగీతం అందిస్తున్న ఈ సినిమా..2023 అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.