పాట చిత్రీకరణలో భగవంత్ కేసరి

పాట చిత్రీకరణలో భగవంత్ కేసరి

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భగవంత్ కేసరి’. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. బాలకృష్ణకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలకపాత్ర పోషిస్తోంది. అర్జున్ రాంపాల్ విలన్‌‌‌‌గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అక్కడ వేసిన భారీ సెట్‌‌‌‌లో బాలకృష్ణ, కాజల్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌, శ్రీలీల, ఇతర ముఖ్య నటీనటులపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు.

 తమన్ సంగీతం అందించిన ఈ పాటకు భాను మాస్టర్‌‌‌‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాటలో బాలకృష్ణ సూపర్ హిట్ సాంగ్ అయిన ‘దంచవే మేనత్త కూతురా’ బిట్‌‌‌‌ను యాడ్ చేసినట్టు తెలుస్తోంది.  సినిమాలోని నటీనటులంతా కనిపించే ఈ పాట బిగ్‌‌‌‌ స్క్రీన్‌‌‌‌ పై కలర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌గా ఉండబోతోంది అంటున్నారు మేకర్స్. ఇందులో బాలకృష్ణ తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పనున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 19న సినిమా విడుదల కానుంది.