బాలయ్య తెలంగాణ స్లాంగ్..భగవంత్ కేసరి టీజర్

 బాలయ్య తెలంగాణ స్లాంగ్..భగవంత్ కేసరి టీజర్

నందమూరి బాలకృష్ణ తాజాగా నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకుడు. మాస్ యాక్షన్ జోనర్లోనే తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఈ రోజు(జూన్ 10) బాలకృష్ణ పుట్టినరోజు కానుకగా భగవంత్ కేసరి ఫస్ట్ టీజర్ ను రిలీజ్ చేశారు. 

బాలయ్య తెలంగాణ స్లాంగ్..

రాజు  ఆని ఎనకున్న మందను చూపిస్తడు..మొండోడు..వాని గుండెను చూపిస్తడంటూ బాలయ్య చెప్పై డైలాగ్ ..సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. ఈ టీజర్ లో బాలయ్య చెప్పిన హిందీ డైలాగ్ హైలెట్. రెండు చెవుల మధ్య మెదడు ఎందుకు ఉంటుందో తెలుసా...చెవిపై దెబ్బ పడితే ఆ దెబ్బ మెదడుకు చేరుతుంది అనే డైలాగ్ కు విజిల్స్ వేయాల్సిందే. అడవి బిడ్డ ..నేలకొండ భగవంత్ కేసరి అంటూ చెప్పై డైలాగ్ తో గూస్ బంప్స్ రాక మానవు. మొత్తానికి భగవంత్ కేసరి టీజర్ ను ..బాలయ్య మార్క్ యాక్షన్ సీన్స్, డైలాగ్స్ తో కట్ చేశారు. ఈ టీజర్ కు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్  హైలైట్ అయ్యాయి. 

భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా కాజల్ కనిపించనుంది. ఆయన కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తోంది. కథ అంతా కూడా తండ్రీ కూతుళ్ల అనుబంధం తోనే  కొనసాగనుంది. తన పాత్రకి గల ప్రాధాన్యత కారణంగానే, శ్రీలీల అంగీకరించినట్టుగా చెబుతున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను దసరాకు విడుదల అవనుంది.