భగవంత్ మాన్ సంచనల నిర్ణయం

భగవంత్ మాన్ సంచనల నిర్ణయం

చండీఘడ్: పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 122 మంది  మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేల భద్రత ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. మాన్ నిర్ణయంతో పలువురు కాంగ్రెస్, అకాలీదళ్, బీజేపీ నేతల సెక్యూరిటీ తొలగించనున్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం గతంలో కేంద్ర హోం శాఖ ఆదేశించిన ప్రకాశ్ సింగ్ బాదల్ కుటుంబంతో పాటు కెప్టెన్ మాజీ సీఎంలైన అమరీందర్ సింగ్, చరణ్జిత్ సింగ్ చన్నీలకు మాత్రమే భద్రత కొనసాగనుంది. 

ఇదిలా ఉంటే పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న భగవంత్ మాన్ ఇవాళ గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ను కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వాలని కోరారు. మార్చ్ 16న భగత్ సింగ్ స్వగ్రామమైన ఖేత్కర్ కలాన్లో భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాజాగా వెలువడిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 17 స్థానాల్లో 92 సీట్లు గెల్చుకుంది.