
కార్తికేయ హీరోగా ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘భజే వాయు వేగం’. ఐశ్వర్య మీనన్ హీరోయిన్. శుక్రవారం విడుదలవుతున్న ఈ సినిమా గురించి కార్తికేయ మాట్లాడుతూ ‘ప్రస్తుతం నాకున్న ఇమేజ్‌కు సరైన చిత్రం ‘భజే వాయు వేగం’. ఇలాంటి చిత్రంలో నటించాలనే నేను కోరుకున్నా. ఇందులో హీరోయిజం, యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్, లవ్ అన్నీ కుదిరాయి. ముఖ్యంగా సెకండాఫ్ రేసీ స్క్రీన్ ప్లేతో ఉంటుంది.
అలాగే చక్కని ఎంటర్‌టైన్మెంట్ కూడా ఉంది. రెగ్యులర్ టైప్ పాటలు ఉండవు. సీరియస్‌గా వెళ్తున్న కథలో పాటలు వస్తే ప్రేక్షకులు డిస్ట్రబెన్స్ ఫీల్ అవ్వొచ్చు. అయితే ఇందులోని ‘సెట్టయిందే’ అనే పాట పాపులర్ అయింది. కథను ముందుకు తీసుకెళ్లేలా దీన్ని ప్లాన్ చేశాం. ఐశ్వర్య మీనన్ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. కథ రివీల్ అవుతుందని ట్రైలర్‌లో తనను ఎక్కువగా చూపించలేదు.
అలాగే హీరో పాత్రను అడాప్ట్ చేసుకున్న కొడుకుగా ట్రైలర్‌లో చూపించాం. దీంతో కథ రివీల్ అయింది అనుకుంటున్నారు. నిజానికి కథ మొదలయ్యేదే అక్కడి నుంచి. ‘హ్యాపీడేస్’ రాహుల్ నాకు బ్రదర్ రోల్ చేశాడు. మా కాంబినేషన్ కొత్తగా ఉంటుంది. విలన్‌ను ఎదురించడం, ఫైట్స్ చేయడమే కాదు, తండ్రి కోసం నిలబడటం, తన వాళ్ల కోసం ఎక్కడి దాకైనా వెళ్లడం, ప్రేమించిన అమ్మాయి కోసం పోరాడటం కూడా హీరోయిజమే. అదే ఇందులో ఉంటుంది. ఫస్టాఫ్‌లో హీరో ఎమోషన్, సెకండాఫ్‌లో దాని వల్ల ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడు అనేది చూస్తారు. ఈ సినిమా విషయంలో క్రెడిట్ అంతా దర్శకుడిదే’ అని చెప్పాడు.