ఆచార్య నుంచి ‘భలే భలే బంజారా’ సాంగ్ రిలీజ్

ఆచార్య నుంచి ‘భలే భలే బంజారా’ సాంగ్ రిలీజ్

ఒకరు డ్యాన్స్ కా బాప్ అయితే ఇంకొకరు ఆ బాప్ కు తగ్గ బేటా. ఈ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే... ఇంకేముంది ఫ్యాన్స్ కు పండగే మరి. వాళ్లిద్దరూ ఎవరో కాదండి... మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి ‘భలే భలే బంజారా... సిరుత పులుల సిందాట’ అనే సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇక ఈ సాంగ్ లో ఇటు చిరు, అటు రామ్ చరణ్ ఒకరికొకరు పోటీ పడి డ్యాన్స్ చేశారు. ఎక్స్ప్రెషన్స్, గ్రేస్, లుక్స్ పరంగా ఇద్దరూ వావ్ అనిపించారు. రెండు చిరుతలు సిందాడితే నిజంగా ఇలాగే ఉంటుందేమో అనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలగకమానదు. 

కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న ‘ఆచార్య’లోని ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా... మణిశర్మ ట్యూన్ కంపోజ్ చేశాడు. శంకర్ మహదేవన్, రాహుల్ సిప్లిగంజ్ అద్భుతంగా పాడారు. శేఖర్ మాస్టర్ సూపర్ కొరియోగ్రఫి అందించాడు. నిరంజన్ రెడ్డి, అన్వేష్రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవికి కాజల్ అగర్వాల్, రామ్ చరణ్కు పూజ హెగ్డే జోడీగా నటించారు. ఏప్రిల్ 29న ‘ఆచార్య’ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. 

మరికొన్ని వార్తల కోసం...

చెస్ ఒలంపియాడ్ కు కౌంట్ డౌన్ షురూ

నిరుద్యోగ భృతి హామీ ఏమైంది?