నిరుద్యోగ భృతి హామీ ఏమైంది?

నిరుద్యోగ భృతి హామీ ఏమైంది?

ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను  అమలుచేయడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. నిరుద్యోగ భృతి, 58 ఏళ్లకే వృద్దాప్య పింఛను, రైతులకు లక్ష రుణమాఫీ వంటివి ఆచరణలోకి రాలేదని చెప్పారు. అభయ హస్తం పేరుతో సేకరించిన రూ.600 కోట్లను వెంటనే లబ్ధిదారులకు తిరిగి ఇచ్చి వేయాలన్నారు. మార్చి నెలాఖరు లోపు 50 వేల లోపు రైతుల రుణాలు మాఫీ చేస్తామని మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగంలో చెప్పినా అమలు కాలేదన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం

ప్రశాంత్ కిషోర్ ప్రజెంటేషన్ పై చర్చ

రోడ్డు ప్రమాదంలో టెన్నిస్ ప్లేయర్ మృతి