వ్యాక్సిన్ల తయారీకి భారత్ బయోటెక్, బిల్‌‌‌‌థోవెన్ జోడీ

వ్యాక్సిన్ల తయారీకి భారత్ బయోటెక్, బిల్‌‌‌‌థోవెన్ జోడీ

న్యూఢిల్లీ: ఓరల్ పోలియో వ్యాక్సిన్‌‌‌‌ల ఉత్పత్తి, సరఫరా కోసం బిల్​థోవెన్​ బయోలాజికల్స్​తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు భారత్ బయోటెక్ మంగళవారం తెలిపింది.  భారత్ బయోటెక్ ఓరల్ పోలియో వ్యాక్సిన్‌‌‌‌ల (ఓపీవీలు) ఉత్పత్తికి సంబంధించిన ఔషధ పదార్థాలను  ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయడానికి రెండు భాగస్వాముల మధ్య ఒప్పందం కుదిరింది.

భారత్ బయోటెక్,బిల్​థోవెన్ బయోలాజికల్స్ భారతదేశంలో ఓపీవీలను వాణిజ్యపరంగా తయారు చేయడానికి అవసరమైన నియంత్రణ అనుమతులను,  లైసెన్స్‌‌‌‌లను పొందుతాయి. ఈ ఒప్పందం వల్ల ఓరల్ పోలియో వ్యాక్సిన్లకు కొరత ఉండదని, పోలియో నిర్మూలన మిషన్​కు మేలు జరుగుతుందని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా చెప్పారు.