టీబీ వ్యాక్సిన్ క్లినికల్‌‌‌‌ ట్రయల్స్‌‌‌‌ మొదలు పెట్టిన భారత్ బయోటెక్‌‌‌‌

టీబీ వ్యాక్సిన్ క్లినికల్‌‌‌‌ ట్రయల్స్‌‌‌‌ మొదలు పెట్టిన భారత్ బయోటెక్‌‌‌‌

న్యూఢిల్లీ: టీబీ వ్యాక్సిన్‌‌‌‌ ఎంటీబీవ్యాక్‌‌‌‌   క్లినికల్ ట్రయల్స్‌‌‌‌ను పెద్దవారిలో మొదలుపెట్టామని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్  ఆదివారం ప్రకటించింది. స్పానిష్‌‌‌‌ బయోఫార్మాస్యూటికల్  కంపెనీ బయోఫాబ్రి ఈ వ్యాక్సిన్‌‌‌‌ను డెవలప్ చేయగా, ఇండియాలో క్లినికల్ ట్రయల్స్‌‌‌‌ను భారత్ బయోటెక్ స్టార్ట్ చేసింది. చిన్న పిల్లల్లో బాసిల్లస్‌‌‌‌ కాల్మెట్టె గురిన్‌‌‌‌ (బీసీజీ)  వ్యాక్సిన్‌‌‌‌ కంటే ఎంటీబీవ్యాక్‌‌‌‌  మెరుగ్గా పనిచేస్తుందని, అలానే పెద్దవారిలో   టీబీ రాకుండా నిరోధిస్తుందని  కంపెనీ ఓ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొంది.