భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 25.
పోస్టుల సంఖ్య: 84.
విభాగాల వారీగా ఖాళీలు: మెకానికల్ ఇంజినీరింగ్ 24, కంప్యూటర్ సైన్స్ 20, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 30, సివిల్ ఇంజినీరింగ్ 10.
ఎలిజిబిలిటీ: సంబంధిత విభాగంలో బి.టెక్./ బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 11.
లాస్ట్ డేట్: 2026, జనవరి 25.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అభ్యర్థులకు 2026, జనవరి 16న, కంప్యూటర్ సైన్స్ అభ్యర్థులకు 2026, జనవరి 17న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
పూర్తి వివరాలకు www.nats.education.gov.in వెబ్సైట్ను సందర్శించండి.

