ఓటరు లిస్టులో తప్పులు ఉండవద్దు : భారతి లక్​పతి నాయక్

ఓటరు లిస్టులో తప్పులు ఉండవద్దు : భారతి లక్​పతి నాయక్

వనపర్తి, వెలుగు : ఓటరు తుది జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలని ఎన్నికల అబ్జర్వర్  భారతి లక్​పతి నాయక్  ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్​లో వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లా అదనపు కలెక్టర్లు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్వోలు, సూపర్ వైజర్లతో తుది ఓటరు జాబితా ప్రచురణపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా మరోసారి  పరిశీలించాలని సూచించారు.

కొత్త ఓటర్లు, తొలగించాల్సిన వారి పేర్లు పొందుపర్చి పోలింగ్ స్టేషన్  వారీగా తుది ఓటరు జాబితా ముద్రించాలని  ఆదేశించారు. కలెక్టర్  తేజస్ నందలాల్  పవార్, అడిషనల్ కలెక్టర్లు కుమార్ దీపక్, ఎస్. తిరుపతి రావు, చీర్ల శ్రీనివాస్, ఆర్డీవోలు పద్మావతి, వెంకట్రామిరెడ్డి, గోపిరామ్, నాగరాజు, చంద్రకళ పాల్గొన్నారు. ఎన్నికల నియమావళిపై అవగాహన పెంచుకోవాలి

నారాయణపేట : ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్  కోయ శ్రీ హర్ష సూచించారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్​ హాల్​లో మోడల్  కోడ్  ఆఫ్  కండక్ట్  అమలు చేసే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, సర్వైవల్  స్టాటిస్టికల్  వీవింగ్ టీమ్, వీడియో సర్వైవల్  టీమ్, అసిస్టెంట్ ఎక్స్​పెండిచర్  అబ్జర్వర్ల శిక్షణపై రివ్యూ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ శిక్షణపై దృష్టి పెట్టి ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు. అడిషనల్​ కలెక్టర్ మయాంక్  మిత్తల్, అశోక్ కుమార్, ఆర్డీవో రాంచందర్  పాల్గొన్నారు.