యూకే బీటీ గ్రూప్‌‌‌‌లో ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌కు 24.5 శాతం వాటా

యూకే బీటీ గ్రూప్‌‌‌‌లో ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌కు 24.5 శాతం వాటా
  • డీల్‌‌‌‌ విలువ రూ.33,200 కోట్లు

న్యూఢిల్లీ : యూకేలోని అతిపెద్ద బ్రాడ్‌‌‌‌బ్యాండ్‌‌‌‌, మొబైల్ కంపెనీ బీటీ గ్రూప్‌‌‌‌లో 24.5 శాతం వాటాను  కొనుగోలు చేయడానికి ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ పేరెంట్ కంపెనీ  భారతీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌  డీల్ కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ 4 బిలియన్ డాలర్ల (సుమారు రూ.33,200 కోట్ల) ని అంచనా. యూకే కంపెనీలను కొనుగోలు చేసిన ఇండియన్ కంపెనీల సరసన భారతీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌ నిలిచింది. టాటా గ్రూప్‌‌‌‌, మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్స్‌‌‌‌టైల్ కంపెనీ వెల్​స్పన్​, టీవీఎస్‌‌‌‌  యూకేలోని కంపెనీలను కొనుగోలు చేశాయి.

అతిపెద్ద టీ బ్రాండ్ అయిన టెట్లీని 271 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.2,900 కోట్ల) కు 2000 లో టాటా టీ కొనుగోలు చేసింది. ఇండియా చరిత్రలో అతిపెద్ద అక్విజేషన్‌‌‌‌గా ఈ డీల్ నిలిచింది. 2006 లో వెల్స్‌‌‌‌పన్‌‌‌‌ టవల్ బ్రాండ్ అయిన   సీహెచ్‌‌‌‌టీ హోల్డింగ్స్ లిమిటెడ్‌‌‌‌లో 85 శాతం వాటాను   రూ.132 కోట్లకు కొనుగోలు చేసింది. టాటా స్టీల్‌‌‌‌ 2007 లో 12 బిలియన్ డాలర్లకు కోరస్ గ్రూప్ పీఎల్‌‌‌‌సీని దక్కించుకుంది. 2008 జూన్‌‌‌‌లో టాటా మోటార్స్ జాగ్వర్ ల్యాండ్‌‌‌‌ రోవర్‌‌‌‌‌‌‌‌ను ఫోర్డ్‌‌‌‌ మోటార్‌‌‌‌‌‌‌‌  నుంచి 2.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.